prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 11:32 am Digital Edition : PRAJA VANI

గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం

గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం.

సత్యం, అహింసా మార్గాలను అనుసరించాలి.

రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి
చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్

సత్యం,అహింసా సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి గారు పిలుపునిచ్చారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం చేగుంట మండలంలోని బి.కొండాపూర్ గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహ మార్గంలో మహాత్మా గాంధీజీ సాగించిన పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా సత్యం, అహింసా సిద్ధాంతాలతో స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించిన గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.గాంధీజీ చూపిన మార్గాన్ని నేటి తరం ఆచరించడం ద్వారా సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యత మరింత బలోపేతమవుతాయని అన్నారు.గాంధీజీ కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.