గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్
గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ ఎల్లంపేట, అక్టోబర్ 2 (ప్రజావాణి):- జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఎల్లంపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్, మున్సిపల్ కమిషనర్ ఎన్. కృష్ణారెడ్డి హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు, ఆయన పాటించిన...