prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 11:05 am Digital Edition : PRAJA VANI

గట్టుసింగారంలో విహెచ్ఎన్‌సీ కార్యక్రమం

గట్టుసింగారంలో విహెచ్ఎన్‌సీ కార్యక్రమం
గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణకు సమష్టి కృషి చేయాలి
కూసుమంచి, అక్టోబర్ 13 (ప్రజావాణి): కూసుమంచి మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం విహెచ్ఎన్‌సీ (VHNC) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణ, గ్రామంలో ఆరోగ్య సేవల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం. విజయ, పంచాయతీ కార్యదర్శి ఏ. ప్రసాద్, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎం కే. సునీత, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్థులకు ఆరోగ్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామంలో ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
గ్రామస్థులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.