prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 12:47 pm Digital Edition : PRAJA VANI

గంధసిరిలో ముగిసిన సువార్త ఉజ్జీవ మహాసభలుగంధసిరిలో ముగిసిన సువార్త ఉజ్జీవ మహాసభలు

గంధసిరిలో ముగిసిన సువార్త ఉజ్జీవ మహాసభలుగంధసిరిలో ముగిసిన సువార్త ఉజ్జీవ మహాసభలు

ముదిగొండ, అక్టోబర్ 6, ప్రజావాణి ప్రతినిధి:
మండల పరిధిలోని గంధసిరి గ్రామంలో ఎస్.డి.ఏ. చర్చి పాస్టర్ చెంగపొంగు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన సువార్త ఉజ్జీవ మహాసభలు సోమవారం రాత్రి ముగిశాయి.

ముఖ్య ప్రసంగకర్తగా ఈస్ట్ తెలంగాణ సెక్షన్ ప్రెసిడెంట్ ఎం.జీ. రావు పాల్గొని, ప్రతి ఒక్కరూ పాపానికి దూరంగా పరిశుద్ధ జీవితం గడుపుతూ భయభక్తులతో, సోదరభావంతో జీవించాలని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఈస్ట్ తెలంగాణ సెక్షన్ బృందం, సంఘ కాపరులు, స్థానిక నాయకులను పాస్టర్ చెంగపొంగు మధుసూదన్ రావు, మరియమ్మ, సంఘ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్, ట్రెజరర్ రాజు, మినిస్ట్రీ సెక్రటరీ స్టీవెన్, సర్పంచ్ మల్లెల రామారావు, ఉపసర్పంచ్ రఫీ, మాజీ ఉపసర్పంచ్ దేవరపల్లి రాఘవరెడ్డి,ముదిగొండ మండల సర్కిల్ పాస్టర్ నామ పౌల్ వివిధ గ్రామాల పాస్టర్స్ ఎల్ ఏలియా, అజయ్ జోసెఫ్, మార్కు, జాన్ వెస్లీ, మాధవరావు వివిధ గ్రామాల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.