prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 2:54 pm Digital Edition : PRAJA VANI

ఖమ్మం నగర అభివృద్ధి పనులను దశల వారీగా అన్నీ పూర్తి చేస్తాం

ఖమ్మం నగర అభివృద్ధి పనులను దశల వారీగా అన్నీ పూర్తి చేస్తాం…!

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 9, 12, 13, 14వ డివిజన్లలో రూ.1.55 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు సుమారు రూ. 5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇంకామిగిలి ఉన్న చిన్న, చిన్న పనులను కూడా రానున్న రోజుల్లో చేపట్టి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నగరంలో మౌళిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మిగిలి ఉన్న చిన్న, చిన్న పనులను కూడా గుర్తించి దశల వారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని మంత్రి సూచించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా పనులు పూర్తి చేయాలని తెలిపారు.
పుట్టపాక నుంచి రాజన్నపేట వరకు రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి, పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటా మని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి, వాటి వివరాలను సుడా చైర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మిగిలిన పనులను కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని తెలిపారు.
ఖమ్మం నగరంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ప్రజలంతా సుఖ సంతోషాలతో, పరస్పర సోదరభావంతో కలిసి మెలిసి జీవించేలా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.