ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం

ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం...! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను వ్యవసాయ, మార్కెటింగ్, ఇతర సంబంధిత శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో వేడుకలను నిర్వహించారు....