క్రెసెంట్ గ్లోబల్ స్కూల్లో దాండియా సందడి
*క్రెసెంట్ గ్లోబల్ స్కూల్లో దాండియా సందడి!* *సంప్రదాయ నృత్యాలతో హోరెత్తిన పాఠశాల ప్రాంగణం* *విద్యార్థుల్లో సంస్కృతి, ఐక్యతాభావాన్ని పెంపొందించేందుకే సాంస్కృతిక వేడుకలు: మాద్రి తన్విశ్రీ *ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు* పటాన్చెరు, అక్టోబర్ 11 (ప్రజావాణి): పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్నగర్లో ఉన్న క్రెసెంట్ గ్లోబల్ స్కూల్లో దాండియా ఉత్సవం–2026 వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన దాండియా నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర...