prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:32 pm Digital Edition : PRAJA VANI

కౌసల్య మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతాపం

*కౌసల్య మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతాపం*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్ అధినేతలు భోగ కైలాసం, భోగ భాస్కర్‌ల తల్లి భోగ కౌసల్య వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం హుటాహుటిన బాలాజీ నగర్ లోని వారి స్వగృహానికి చేరుకున్నారు. కౌసల్య గారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గారు పరామర్శించారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, కౌన్సిలర్లు సుగుణాకర్, బూడిద జ్యోతి గోపి, మాజీ కౌన్సిలర్ అనిత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.