prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 4:33 pm Digital Edition : PRAJA VANI

కౌలాస్ లో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టా

కౌలాస్ లో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టా

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఉప సర్పంచ్ పూజారి గణేష్

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన ఉప సర్పంచ్ పూజారి గణేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలునిర్వహించారు.డప్పుచప్పుళ్లు డీజే పాటలు కోలాట బృందాల ప్రదర్శనల నడుమ దుర్గాదేవికి సంబంధించిన చీర ముక్కుపుడకను ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.. సర్పంచ్ విద్య బలరాం, ఉప సర్పంచ్ పూజారి గణేష్, బొగ్గుల గంగాధర్, మంత్రి సాయిలు, విశ్వనాధ్ పంతులు, గ్రామ పెద్దలు అనిత సింగ్, గంగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్,హన్మ గౌడ్, సర్పంచ్ కుమారుడు రాజేష్, అన్వర్, రమేష్, తదితరులు గ్రామస్తులు తదితరులు పాల్గొని దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్డుకు చెందిన యువకులు భక్తులుపెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు అనంతరం భక్తులు తీర్థప్రసాదాలుస్వీకరించారూ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠతో పాటు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.