prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 12:00 pm Digital Edition : PRAJA VANI

కౌలాస్ లో గ్రామసభ నిర్వహణ

కౌలాస్ లో గ్రామసభ నిర్వహణ..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో బుధవారం రోజున గ్రామసభ అలాగే సోషల్ ఆడిట్ సర్పంచ్ విద్య బలరాం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.. ఊరిలోని సమస్యలు అభివృద్ధి పనులపై గ్రామస్తులతో, అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యా బలరాం మాట్లాడుతూ… గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంది ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రజలందరూ భాగస్వాములు అయితే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు అని, పూరి అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం సోషల్ ఆడిట్ నిర్వహించారు.. ఉపాధి హామీ గురించి గ్రామస్తులకు ఏపీఓ తులసిరాం అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పథకం నిరుపేదలకు చాలా మంచిదని కాబట్టి ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు వెళ్లాలని ఈ సందర్భంగా ఏపీఓ తులసి రామ్ అన్నారు. అలాగే ఉపాధి హామీ పేరు నమోదు లేకపోతే పేరు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.. సర్పంచ్ విద్యా బలరాం, ఉప సర్పంచ్ పూజారి గణేష్, ఏపీఓ తులసి రామ్, టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్, డిఆర్పి గంగాధర్, గంగరాజు, సర్పంచ్ కుమారుడు రాజేష్, విశ్వనాథ్ పంతులు, బొగ్గుల గంగాధర్, మంత్రి సాయిలు, రమేష్, తత్తరులు గ్రామస్తులు పాల్గొన్నారు..