prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 8:02 am Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న హత్య కేసు నిందితుడి అరెస్ట్.

కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న హత్య కేసు నిందితుడి అరెస్ట్.

 

నాయనమ్మ హత్య కేసులో నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు.

 

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్.

 

హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు.

 

హుజూర్నగర్ అక్టోబర్ 13 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 253/2023లో నాయనమ్మను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సలీం పాషా (42), నేరేడుచర్ల పట్టణం, రిమాండ్ ముగిసిన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో హుజూర్‌నగర్ కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

 

ఈ క్రమంలో అతని కదలికలపై నిఘా ఉంచి నేరేడుచర్ల పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితుడిని హుజూర్‌నగర్ సబ్‌జైలుకు తరలించారు. కోర్టు వాయిదాలకు హాజరుకావడం ప్రతి నిందితుడి బాధ్యత. కోర్టు నోటీసులు, వారెంట్లు, వాయిదాలను నిర్లక్ష్యం చేస్తూ చట్ట ప్రక్రియ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమందరాజు తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టపరమైన ప్రక్రియకు సహకరించాలి అన్నారు.