కోతుల బెడద భయాందోళనలొ ప్రజలు
కోతుల బెడద భయాందోళనలొ ప్రజలు గోవిందరావుపేట(ప్రజావాణి) మండలంలోని పసర గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, నివాస ప్రాంతాల్లో మకాం వేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా కోతుల దాడుల్లో పలువురు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలోకి చొరబడి హల్‌చల్.. కోతులు ఇళ్లలోకి సులభంగా చొరబడి వంటగదుల్లోని ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అన్నం గిన్నెలు, పప్పు డబ్బాలు, ఇతర ఆహార పదార్థాలను తీసుకెళ్లడంతోపాటు బియ్యం సంచులను చింపి బియ్యాన్ని...