కోతులనడుమ గ్రామంలో ఘనంగా దుర్గామాత ఊరేగింపు
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాతకు నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా బుధవారం అమ్మవారికి అభిషేకం చేసి,నిమజ్జన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని,శ్రీ దుర్గామాత ఆశీస్సులు గ్రామస్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు.
అమ్మవారి కృపతో గ్రామంలో శాంతి,సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.