prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 2:50 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

కోటిలింగాల పుష్కర ఘాట్లు, ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన

వెల్గటూర్ మండలం కోటిలింగాల దేవస్థాన పునర్నిర్మాణ పనులను, గోదావరి పుష్కర ఘాట్లను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన కోటిలింగాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్, సర్పంచులు సంగ రమేష్ యాదవ్, కొంగల జగదీశ్వర్ రెడ్డి, అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.