prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 3:20 pm Digital Edition : PRAJA VANI

కొండారెడ్డిపల్లిలో రీ-సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ సంగీత

కొండారెడ్డిపల్లిలో రీ-సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ సంగీత

• పట్టాదారుల వారీగా భూమి వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం

• కొండారెడ్డిపల్లిలో రీ-సర్వే పరిశీలన

• సర్వే నంబర్ వారీగా పట్టాదారుల భూముల వివరాల నమోదు

• ఎంజాయ్‌మెంట్ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశం

• కొండారెడ్డిపల్లి తండా •ప్రాథమిక పాఠశాల సందర్శన
విద్యార్థుల చదువు

•ప్రమాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

అందోల్ , కొండారెడ్డిపల్లి అక్టోబర్ 6: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

అందోల్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి సంగీత పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేయర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వెంట ఏడీఐ హైనెస్ ఉన్నారు.
సర్వే నంబర్ వారీగా ప్రతి పట్టాదారుడిని పిలిపించి, వారి పేరుపై ఉన్న భూమి ఎంత, ప్రస్తుతం ఎంత భూమి వారి ఎంజాయ్‌మెంట్‌లో ఉందనే వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత రికార్డులను పరిశీలించి, భూమి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
అనంతరం కొండారెడ్డిపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి చదువు గురించి తెలుసుకున్నారు. విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పుస్తకాలను చదివించి, వారి విద్యా ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు.