prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 9:31 pm Digital Edition : PRAJA VANI

కొండాపూర్ గ్రామ ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

కొండాపూర్ గ్రామ ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్
దండేపల్లి, అక్టోబర్ 10 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
గ్రామంలో ప్రజలందరూ ఐకమత్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆకాంక్షించారు.