కొండాపూర్ గుడ్ బ్లెస్సింగ్ చర్చిలో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు
కేక్ కట్ చేసి పాస్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్ డాక్టర్ మన్నె శామ్యూల్, స్వప్న దంపతులు
దండేపల్లి, అక్టోబర్ 11 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని గుడ్ బ్లెస్సింగ్ చర్చిలో పాస్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ డాక్టర్ మన్నె శామ్యూల్, స్వప్నగారు కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొని పాస్టర్స్ డే వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ల సేవలను కొనియాడుతూ, సమాజంలో ఆధ్యాత్మిక విలువలు, ప్రేమ, శాంతి, సేవాభావాన్ని పెంపొందించడంలో పాస్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
చర్చి సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చర్చిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించారు.