కొండాపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు….ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపినకోరుబోతు నాగరాజు, ఇమ్మడి ఉపేంద్ర రాణి.

ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపల్ పరిధిలోని కొండాపూర్ స్ట్రీట్ నంబర్‌ 4లో బతుకమ్మ వేడుకలను కోరుబోతు నాగరాజు, ఇమ్మడి ఉపేంద్ర రాణి, , ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా తమ కాలనీలో పండుగ సంప్రదాయాలను కొనసాగిస్తూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, కోలాటాల సందడి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...