prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 4:08 pm Digital Edition : PRAJA VANI

కొండపూర్‌లో వి.బి.జి. రాంజీ నూతన పనుల ఎంపికకు గ్రామసభ

కొండపూర్‌లో వి.బి.జి. రాంజీ నూతన పనుల ఎంపికకు గ్రామసభ
కొండపూర్‌లో వి.బి.జి. రాంజీ నూతన పనుల ఎంపికకు గ్రామసభ
దండేపల్లి, అక్టోబర్ 2 (ప్రజావాణి):
గాంధీ జయంతిని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని కొండపూర్ గ్రామపంచాయతీలో వి.బి.జి. రాంజీ పథకం కింద నూతన పనుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఇప్ప రవళి సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో పలు అభివృద్ధి పనులను ఎంపిక చేసి తీర్మానించారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి దర్శనాల నాగేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి రైతు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను, వ్యవసాయ పొలాల వద్ద నీటి గుంతలను నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు.
గ్రామసభలో మట్టి రోడ్లు, ఇంకుడు గుంతలు, నీటి గుంతలు, పండ్ల తోటల అభివృద్ధి తదితర పలు నూతన పనులను ఎంపిక చేసి తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గంధం భాగ్యమ్మ, ఆశా కార్యకర్త మన్నె సుమలత, ఆయా స్రవంతి, ఐకేపీ సీఏ గుమ్మడి సునీత, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.