కేటీఆర్‌ను కలిసిన కూకట్పల్లి ఎమ్మెల్యే.. విజయదశమి శుభాకాంక్షలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పండుగ శుభాకాంక్షలు తెలిపిన కూకట్పల్లి ఎమ్మెల్యే
హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజావాణి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందంగా, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.