కేఎల్ మహేంద్ర నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

పోచారం, అక్టోబర్ 10 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా కాలనీ మహిళలు ఉత్సాహంగా పాల్గొని పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాహలం, బతుకమ్మల అందాలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ...