కేఎల్ మహేంద్ర నగర్లో ఘనంగా దసరా వేడుకలు
ఘట్కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, అన్నోజిగూడ పరిధిలో ఉన్న కేఎల్ మహేంద్ర నగర్ కాలనీలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ సందడి నెలకొనగా, స్థానికులు పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా గడిపారు. దసరా పండుగ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆప్యాయతలను పెంపొందిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు కాలనీవాసులందరినీ ఒకచోట...