prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 4:01 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

కేఎల్ మహేంద్ర నగర్‌లో ఘనంగా దసరా వేడుకలు

ఘట్‌కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, అన్నోజిగూడ పరిధిలో ఉన్న కేఎల్ మహేంద్ర నగర్ కాలనీలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీలో పండుగ సందడి నెలకొనగా, స్థానికులు పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా గడిపారు. దసరా పండుగ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆప్యాయతలను పెంపొందిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు కాలనీవాసులందరినీ ఒకచోట చేర్చి, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేఎల్ మహేంద్ర నగర్ కాలనీకి చెందిన బిక్కు నాయక్, శ్యామ్, యాదగిరి, మైసయ్య, సురేష్, ఎన్. రాములు, లింగమల్లు, ఉపేందర్, రాజుతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొని దసరా వేడుకలను విజయవంతం చేశారు.