కృషి విజ్ఞాన కేంద్రం, వనిపెంటలో మహిళ్ళా కిసాన్ దినోత్సవ వేడుకల నిర్వహణ,ముఖ్య అతిధిగా పాల్గొన్న బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నారిశెట్టి సుప్రజ

మైదుకూరు వనిపెంట అక్టోబర్ 15 ప్రజావాణి  కృషి విజ్ఞాన కేంద్రం,వనివెంటలో మహిళా కిసాన్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఇందులో భాగంగా ముందుగా ఎస్. కాంతిశ్రీ,గృహ విజ్ఞాన శాస్త్రవేత్త వారు వ్యవసాయరంగంలో మహిళల పాత్ర, కాలాను గుణంగా వచ్చి న మార్పులు, యాంత్రీకరణ గురించి మహిళా రైతులకు వివరించారు. డా టి విజయ నిర్మల, పశుపోషణ విభాగ శాస్త్రవేత్త, పశు పోషణలో మహిళల పాత్ర, సమగ్ర వ్యవసాయ విధానాలు కేవికే సాo కేతిక సహకారం గురించి తెలియ చేశారు.డా శ్రీవిద్యారాణి ఎన్ శాస్త్రవేత్త,విస్తరణ విభాగం వారు వ్యవసాయంలో...