మైదుకూరు వనిపెంట అక్టోబర్ 15 ప్రజావాణి కృషి విజ్ఞాన కేంద్రం,వనివెంటలో మహిళా కిసాన్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఇందులో భాగంగా ముందుగా ఎస్. కాంతిశ్రీ,గృహ విజ్ఞాన శాస్త్రవేత్త వారు వ్యవసాయరంగంలో మహిళల పాత్ర, కాలాను గుణంగా వచ్చి న మార్పులు, యాంత్రీకరణ గురించి మహిళా రైతులకు వివరించారు. డా టి విజయ నిర్మల, పశుపోషణ విభాగ శాస్త్రవేత్త, పశు పోషణలో మహిళల పాత్ర, సమగ్ర వ్యవసాయ విధానాలు కేవికే సాo కేతిక సహకారం గురించి తెలియ చేశారు.డా శ్రీవిద్యారాణి ఎన్ శాస్త్రవేత్త,విస్తరణ విభాగం వారు వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి.. విత్తనం వేయడం నుండి పంట కోత వరకు మహిళలు ఎంతో కష్టపడుతారని వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని, వారికి సహాయపడే పని ముట్లు ఏర్పాటు చేయడం గురించి చెప్పారు.ముఖ్య అతిధి శ్రీమతి నారిశెట్టి సుప్రజ, బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వారు మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాలలో ప్రాతి నిత్యం వహించాలని,ముఖ్యంగా వ్యవసాయంలో మహిళలతోనే ఆన్ని కార్యక్రమాలు ముడి పడి ఉంటాయని పేర్కొన్నారు. కుటుంబంలో మహిళ అన్ని రంగాలలోకి అడుగు పెట్టి విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల పోత్సాహం ముఖ్యంగా తల్లితండ్రులు, వివాహ నంతరం భర్త వారికి తోడ్పాటు అందించాలని చెప్పారు. తాను కూడా వ్యవసాయ కుటుంబంలోనే పుట్టానని రైతు లేని సమాజం అభివృద్ధికి నోచుకోదని చెప్పారు – శ్రీ నారిశెట్టి నాగేంద్ర, బిజెపి మండల (ప్రెసిడెంట్ పోరుమామిళ్ళ) వారు మహిళలు ఆన్నీ రంగాల్లో ముందు ఉండడానికి కెవీకే నిర్వహించే మహిళా సాధికారక కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని త ద్వారా వారి రంగాలలో ఆవకాశాలను తెలుసుకోవాలని చెప్పారు.ప్రతాప్ రెడ్డి, మైదుకూరు వారు మరియు సురేంద్ర అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట వారు మహిళలు కు టుంబలోని భాధ్యతలతో పాటు వ్యవసాయ రంగంలో ఆధునిక జీవన విధానం అలసి పోకుండా తమ వంతు పాత్ర ను పోషిస్తున్నారు అన్నారు .ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళా రైతులు తమ విజయ గాధలని సభలో పంచుకున్నారు. రావెప్ విద్యార్థులు కూడా ఉద్యాన రంగంలో మహిళా లోకం యొక్క పాత్ర వారి అనుభవం గురించి తెలియచేశారు. కార్యక్రమంలో 62 మంది రైతులు, రైతు సోదరీమణులు పాల్గోని దిగ్విజయం చేశారు