కూసుమంచి నూతన ఎస్సై సతీష్‌కు సన్మానం
కూసుమంచి నూతన ఎస్సై సతీష్‌కు సన్మానం కూసుమంచి, అక్టోబర్ 21 (ప్రజావాణి): ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సతీష్‌ను మండల కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్, జీళ్ళచెరువు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ప్రజలకు అందుబాటులో...