కూసుమంచి ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ
కూసుమంచి ఎస్సైగా సతీష్ బాధ్యతల స్వీకరణ కూసుమంచి ప్రజావాణి, అక్టోబర్ 16: ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా సతీష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన నాగరాజు బదిలీపై కల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై సతీష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై నాగరాజును సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.