కూసుమంచిలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభం
కూసుమంచి, అక్టోబర్ 15 (ప్రజావాణి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని బ్రాంచ్ మేనేజర్ రవికుమార్, చీఫ్ సేల్స్ మేనేజర్ రామారావు, సేల్స్ మేనేజర్ పెండ్ర అంజయ్య ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ హాఫీజుద్దీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ సెట్రామ్ నాయక్, సర్పంచ్ బొంగా నాయక్, నాయకులు భారీ వీరభద్రం, కొండా శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘం మండల బాధ్యులు జర్పుల భద్రునాయక్, సోషల్ మీడియా అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్ హాజరై కార్యాలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య బీమా సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూసుమంచి మండల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య బీమా సేవలు అందించేందుకు సేల్స్ మేనేజర్ పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలోని బృందం కృషి చేస్తుందని పేర్కొన్నారు. నూతన పాలసీలతో పాటు రెన్యూవల్ సేవలను కూడా కార్యాలయం ద్వారా పొందవచ్చని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఆడేపు శివ, వడ్తియా బాలకృష్ణ, చెక్కల నాగస్వర్ణ, సురేష్, పోశం రామారావు, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.