prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 9:00 pm Digital Edition : PRAJA VANI

కూలిరేట్ల పెరుగుదల కోసం టైలర్ కార్మికుల సమ్మె

కూలిరేట్ల పెరుగుదల కోసం టైలర్ కార్మికుల సమ్మె

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 06(ప్రజావాణి):కూలిరేట్ల పెరుగుదల కోసం ది జనగామ పట్టణ టైలర్ వర్కర్స్ యూనియన్ (రిజి. నం: E1711) మంగళవారం జనగామ పట్టణ టైలర్స్ అధ్యక్షులు దేవసాని రాజేశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో కార్మికులు మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం విపరీతంగా పెరిగినప్పటికీ, టైలర్ కార్మికుల కూలిరేట్లు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన ప్రతిఫలం లేక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.

ఈ విషయమై కూలిరేట్లు పెంచాలని కోరుతూ యాజమాన్యాలకు లేఖ ద్వారా విన్నవించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.

కావున కార్మికులందరూ ఏకగ్రీవంగా సమావేశమై కూలిరేట్లు పెంచే వరకు సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు యూనియన్ ప్రకటించింది.

జనగామ పట్టణంలోని టైలర్ కార్మికులందరూ ఐక్యంగా నిలిచి సమ్మెను విజయవంతం చేయాలని యూనియన్ పిలుపునిచ్చింది.
కూలిరేట్లు పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని,టైలర్ కార్మికుల ఐక్యతే మన బలం – న్యాయమైన కూలిరేట్లు సాధించడమే మన లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.