prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:33 am Digital Edition : PRAJA VANI

కూన్య తండాలో పాత కక్షలతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలు.

కూన్య తండాలో పాత కక్షలతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలు.

ఆరుగురు లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రజావాణి న్యూస్ మిర్యాలగూడ. నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలంలో గల కూన్య తాండకు చెందిన రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు తారస్తాయి కి చేరి ఆరుగురు వ్యక్తులు గాయలపాలయ్యారు. వివరల్లోకి వెళితే కూన్య తాండకు చెందిన రెండు కుటుంబాలు ధనవత్ వెంకట్రాం ధనావత్ కృష్ణ కుటుంబాలకు గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ధనవత్ కృష్ణ కుటుంబసభ్యులు ఐన ధనవత్ దశ్రు ధనవత్ శివాజీ ధనవత్ బాబు లు ధనావత్ వెంకట్ రామ్ కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి తెగబడి దాడి చేయగా వెంకట్రామ్ కుటుంబ సభ్యులు ధనావత్ గమ్మ ధనావత్ చింటూ ధనావత్ శివ ధనావత్ బాల తీవ్ర గాయాల పాలయి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇట్టి విషయంపై ఇరు వర్గాలు త్రిపురారం పోలీస్ స్టేషన్ లో పిటిషన్ సమర్పించగా పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు.