కూనవరం ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 17
కూనవరం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వెంకట్రావు గారిని స్థానిక పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పూల బొకే ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ పార్టీ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. పోలీసు శాఖకు ప్రజల నుండి పూర్తి మద్దతు అందేలా కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోడియం అప్పారావు ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరావు శ్రీమంతుల సతీష్, బాలు, బూతు ఇన్చార్జి.రాంబాబు, మరియు మండల కమిటీ సభ్యులు క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.