prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:31 pm Digital Edition : PRAJA VANI

కూటిగల్ గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం

కూటిగల్ గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం

బతుకమ్మ,దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కృషి

గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ

మద్దూరు అక్టోబర్13, ప్రజా వాణి,

మండలంలోని కూటిగల్ గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ దాసరం బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్బంగా మంగళ వారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక వర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో పండుగలను పురస్కరించుకొని విద్యుత్, త్రాగు నీరు కొరత లేకుండ ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి వాటిని పాలకవర్గంతో చర్చించి తీర్మానం చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను ప్రతి ఒక్కరు సహకరించి బతుకమ్మ దసరా పండుగ వేడుకలను విజయవంతం చేసుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిత, వార్డు సభ్యులు ఎర్రోజు సంతోష, బండి కళావతి, సిరిగిరి భాగ్యలక్ష్మి, సిరిమల్ల సతీష్, గడిపే మధు, తదితరులు పాల్గొన్నారు.