prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 8:36 pm Digital Edition : PRAJA VANI

కూకట్‌పల్లి బతుకమ్మ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మొలుగు శ్రావణి

కూకట్‌పల్లి బతుకమ్మ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మొలుగు శ్రావణి

శివుడి అలంకరణలో బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

కూకట్‌పల్లి, అక్టోబర్ 10 (ప్రజావాణి):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కూకట్‌పల్లిలో ఘనంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు బతుకమ్మ వేడుకల్లో మొలుగు శ్రావణి శివుడి అలంకరణతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బతుకమ్మను చేతబూని పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.

వివిధ రకాల రంగురంగుల పూలతో సంప్రదాయబద్ధంగా అలంకరించిన బతుకమ్మ తెలంగాణ పూల పండుగ వైభవాన్ని చాటిచెప్పింది. బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటారు.

బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి వేడుకల ద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించవచ్చని ఈ సంబరాలు సందేశమిచ్చాయి. కూకట్‌పల్లిలో పండుగ వాతావరణం వెల్లివిరియగా, శివుడి అలంకరణలో రూపొందించిన బతుకమ్మతో మొలుగు శ్రావణి పాల్గొనడం వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చింది.