కూకట్పల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కూకట్పల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు దంపతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు కూకట్పల్లి, అక్టోబర్ 19 (ప్రజావాణి): తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మ సంబరాలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ...