కూకట్‌పల్లిలో ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవం

కూకట్‌పల్లిలో ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవం పథసంచలన్‌లో గణవేష్‌తో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్‌పల్లి, అక్టోబర్ 25 (ప్రజావాణి): కూకట్‌పల్లి నగర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పథసంచలన్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గణవేష్ ధరించి పాల్గొన్నారు. కూకట్‌పల్లిలోని జెనెసిస్ స్కూల్ వద్ద ప్రారంభమైన పథసంచలన్ ఈస్ట్ కమాన్, తాండ్రపాపారాయుడు సెంటర్, పాత శివాలయం, రామాలయం, శేషాద్రి కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీ, శాంతినగర్...