prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 8:53 pm Digital Edition : PRAJA VANI

కూకట్‌పల్లిలో ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవం

కూకట్‌పల్లిలో ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవం

పథసంచలన్‌లో గణవేష్‌తో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్‌పల్లి, అక్టోబర్ 25 (ప్రజావాణి):

కూకట్‌పల్లి నగర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పథసంచలన్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గణవేష్ ధరించి పాల్గొన్నారు.

కూకట్‌పల్లిలోని జెనెసిస్ స్కూల్ వద్ద ప్రారంభమైన పథసంచలన్ ఈస్ట్ కమాన్, తాండ్రపాపారాయుడు సెంటర్, పాత శివాలయం, రామాలయం, శేషాద్రి కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీల మీదుగా కొనసాగి తిరిగి జెనెసిస్ స్కూల్ వద్దకు చేరుకుంది.

అనంతరం ధ్వజ ప్రణామం, వక్తల పరిచయం, సందేశాలతో విజయదశమి ఉత్సవ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, సమాజంతో కలిసి నడుస్తూ సమాజ శ్రేయస్సు కోసం సమష్టిగా పనిచేయడమే పథసంచలన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఐకమత్యం, సేవాభావం, సామాజిక సమరసత వంటి విలువలను ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఈ విజయదశమి ఉత్సవం చాటిచెప్పిందని తెలిపారు.