కూకట్‌పల్లిలో కాలభైరవ హోమం

కూకట్‌పల్లిలో కాలభైరవ హోమం అక్టోబర్ 4న ప్రత్యేక పూజలు.. భక్తులు పాల్గొనాలని ఆలయ నిర్వాహకుల మనవి కూకట్‌పల్లి, అక్టోబర్ 3 (ప్రజావాణి): హైదరాబాద్‌ కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని శ్రీ భువనేశ్వరి సమేత ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామికి ప్రత్యేక హోమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ పుల్లూరు నారాయణ దాస్ స్థాపించిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆదివారం అక్టోబర్ 4న ఉదయం 8 గంటలకు కాలభైరవ స్వామి హోమం ప్రారంభం కానుంది. ఒకే ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల...