కూకట్‌పల్లిలో కాలభైరవ హోమం
అక్టోబర్ 4న ప్రత్యేక పూజలు.. భక్తులు పాల్గొనాలని ఆలయ నిర్వాహకుల మనవి
కూకట్‌పల్లి, అక్టోబర్ 3 (ప్రజావాణి): హైదరాబాద్ కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని శ్రీ భువనేశ్వరి సమేత ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామికి ప్రత్యేక హోమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ పుల్లూరు నారాయణ దాస్ స్థాపించిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆదివారం అక్టోబర్ 4న ఉదయం 8 గంటలకు కాలభైరవ స్వామి హోమం ప్రారంభం కానుంది.
ఒకే ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలతో పాటు శ్రీ భువనేశ్వరి దేవి, కాశీ క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతగా పేర్కొన్నారు. కాలభైరవ అష్టమి, శని దోష నివారణ, రాహు–కేతు పూజల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
కాలభైరవ స్వామి హోమంలో పాల్గొనదలచిన భక్తులు రూ.500 చెల్లించి తమ గోత్రనామాలను నమోదు చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.