కుల్కచర్ల మండల మహిళా సమాఖ్యలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కుల్కచర్ల మండల మహిళా సమాఖ్యలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, మహిళ సమైక్య అధ్యక్షురాలు సంతోష ఆధ్వర్యంలో పరిగి (ప్రజావాణి), అక్టోబర్ 15: కుల్కచర్ల మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ప్రకృతిని ఆరాధించే ఈ విశిష్ట పూల పండుగలో స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొని సందడి చేశారు. తీరొక్క పూలైన గునుగు, తంగేడు, బంతి, చామంతి, గులాబీలతో మహిళలు ఆకర్షణీయమైన బతుకమ్మలను తీర్చిదిద్దారు. ముగ్గులతో ముస్తాబు...