కుల్కచర్ల మండల మహిళా సమాఖ్యలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, మహిళ సమైక్య అధ్యక్షురాలు సంతోష ఆధ్వర్యంలో
పరిగి (ప్రజావాణి), అక్టోబర్ 15:
కుల్కచర్ల మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ప్రకృతిని ఆరాధించే ఈ విశిష్ట పూల పండుగలో స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొని సందడి చేశారు.
తీరొక్క పూలైన గునుగు, తంగేడు, బంతి, చామంతి, గులాబీలతో మహిళలు ఆకర్షణీయమైన బతుకమ్మలను తీర్చిదిద్దారు. ముగ్గులతో ముస్తాబు చేసిన ప్రాంగణంలో బతుకమ్మలను కొలువుదీర్చి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ గౌరమ్మ పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, మండల సమైక్య అధ్యక్షరాలు సంతోష, కోశాధికారి శ్రీలత, ఎఫ్ పి ఒ అధ్యక్షురాలు శ్రీదేవి, వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.