prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 11:57 am Digital Edition : PRAJA VANI

కులమతాలకు అతీతంగా దుర్గామాత పూజలో పాల్గొన్న జయపురం సర్పంచ్ దంపతులు – సమానత్వం, సామాజిక ఐక్యతకు పెద్దపీట

దుర్గామాత పూజలో
కులమతాలకు అతీతంగా సమానత్వానికి పెద్దపీట వేస్తున్న జయపురం గ్రామ సర్పంచ్ నెలకుర్తి రేణుక–అశోక్ రెడ్డి దంపతులు

నర్సింహులపేట మండలం ప్రజావాణి రిపోర్టర్:జయపురం గ్రామంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, సమానత్వం మరియు సామాజిక ఐక్యతకు పెద్దపీట వేస్తున్న జయపురం గ్రామ సర్పంచ్ నెలకుర్తి రేణుక, అశోక్ రెడ్డి దంపతులు దుర్గామాత పూజా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, ప్రతి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న సర్పంచ్ దంపతుల తీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కులవివక్షలకు తావులేకుండా, ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం దక్కేలా సామాజిక ఐక్యతను పెంపొందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.బహుజన బాంధవులుగా ప్రజలతో మమేకమవుతూ… సమానత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ,కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకుపోతూ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక ఐక్యతను బలోపేతం చేసే ఇలాంటి కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి దోహదపడతాయని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చుక్క వేణు దంపతులు, వార్డు సభ్యులు రామ్మూర్తి, వెంకన్న, విగ్రహదాత రజినీకాంత్, కమిటీ సభ్యులు వనగండ్ల మధు, దుడ్డేల నాగరాజు, నవీన్ మహేష్, దుడ్డేల ఉప్పలయ్య అశోకు, మందుల యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.