కుప్పానగర్లో ఆధ్యాత్మిక వైభవం
కుప్పానగర్లో ఆధ్యాత్మిక వైభవం.. దేవి దివ్య అలంకరణతో భక్తులకు కనువిందు! శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తి పారవశ్యం.. ప్రత్యేక పూజలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం ఝరాసంగం, అక్టోబర్ 17 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. జహీరాబాద్ శబరిమల భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తిభావాన్ని నింపుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా దివ్య అలంకరణలో తీర్చిదిద్దడంతో భక్తులకు కనువిందు చేసింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలిరావడంతో ఆలయ...