కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం

కుప్పానగర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అమ్మవారి దివ్య అలంకరణతో భక్తులకు కనువిందు! శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాండురంగ భజన మండలి ఆధ్యాత్మిక సేవలు.. మరో ఆరు రోజులపాటు భజనలు ఝరాసంగం, అక్టోబర్ 14 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అమ్మవారి దివ్య అలంకరణలు, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. నారాయణఖేడ్‌కు చెందిన చిత్రంపల్లి పాండురంగ భజన మండలి మూడవ రోజు భజన...