కుక్కల దాడి నుంచి కొండగొర్రెను కాపాడిన యువకులు

కుక్కల దాడి నుంచి కొండగొర్రెను కాపాడిన యువకులు పరిగి,అక్టోబర్ 16 ( ప్రజావాణి) ఆహారం, తాగునీరు వెతుక్కుంటూ అడవి నుంచి దారితప్పి వచ్చిన ఓ కొండగొర్రె శుక్రవారం కులకచర్ల శివారు ప్రాంతంలో కలకలం సృష్టించింది. రామలింగేశ్వర కళాశాల సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న ఈ మూగజీవిని చూసి వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడికి దిగాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో పరుగులు తీసిన ఆ కొండగొర్రె నేరుగా సమీప నివాసాల వైపు దూసుకొచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక యువకులు సత్యం, అంజలయ్య, శ్రీను...