కిష్టయ్య గారి మృతి తీరని లోటు.. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి
చేగుంట మండల తాజా మాజీ జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ గారి తండ్రి కిష్టయ్య గారి మరణవార్త తీవ్ర విచారం కలిగించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి అన్నారు.కిష్టయ్య గారి మృతి వారి కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ,వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా కిష్టయ్య గారి స్వగ్రామమైన పెద్ద శివనూరులో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి పాల్గొని,ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
.అనంతరం ముదాం శ్రీనివాస్ గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి,పట్నం తానీషా,రఘోత్తం రెడ్డి,డిష్ రాజు, సుభాష్ రెడ్డి, ఓలియా నాయక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.