కిచ్చన్నపల్లిలో రీ సర్వేపై ఫీల్డ్ ట్రైనింగ్
రీ సర్వే ప్రక్రియపై అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ
మన సమగ్ర ప్రజావాణి అందోల్, అక్టోబర్ 15: జిల్లా ప్రతినిది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో భూముల రీ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రెండు గ్రామాలను ఎంపిక చేసి, రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహణకు చర్యలు చేపట్టారు.
రీ సర్వే ప్రక్రియపై బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో సంబంధిత బృందాలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా గురువారం అందోల్ మండలంలోని కిచ్చన్నపల్లి గ్రామంలో అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ నిర్వహించారు. రీ సర్వే నిర్వహించే విధానం, భూముల వివరాల సేకరణ, సర్వే ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సాగర్ మధుకర్ రెడ్డి, ఏడీ అయినేష్, సర్వేయర్లు మురళి, యాదయ్య, డీఐలు, మండలాల ఆర్ఐలు, నాయబ్ తహసీల్దార్లు, సర్వేయర్లు, జీపీఓలు పాల్గొన్నారు.