prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 5:44 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కాశినయన మండలంలో రికార్డు స్థాయి ఏకగ్రీవాలు: 9 MPTC స్థానాలతో పాటు ఎంపీపీ పీఠం కైవసం చేసుకున్న కూటమి!

కాశినయన ( కడప జిల్లా):అక్టోబర్ 27 ప్రజావాణి కాశినయన మండల పరిషత్ ఎన్నికల్లో సరికొత్త రాజకీయ అధ్యాయం లిఖించబడింది. మండలంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా జరగాల్సిన ఎన్నికలు.. స్థానిక సమీకరణాలు, వ్యూహాత్మక రాజకీయాల నేపథ్యంలో పూర్తిగా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపాయి. మండలంలోని మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు ఒకే విడతలో ఏకగ్రీవం కావడం విశేషం. ఇందులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) క్లీన్ స్వీప్ చేయగా, ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు.ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. మండలంలోని వేర్వేరు స్థానాల నుంచి కింది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు:వడ్డమాను స్థానం: గుర్రాల సుబ్బమ్మ (టీడీపీ) నరసాపురం స్థానం: కర్నాటి వెంకటరెడ్డి (టీడీపీ) రంపాడు స్థానం: ఆవుల ప్రసాద్ (టీడీపీ)ఇటుకలపాడు స్థానం: బొల్లినేని ధనలక్ష్మి (టీడీపీ)సావిశెట్టిపల్లి స్థానం: యంబడి మరియమ్మ (టీడీపీ)కత్తేరగండ్ల స్థానం: జల్లి లక్ష్మీనరసమ్మ (టీడీపీ)గంగనపల్లి స్థానం: వేములకోట బాదుల్ల (టీడీపీ) వరికుంట్ల స్థానం: దిన్నెపు వెంకట క్రిష్ణారెడ్డి (టీడీపీ)కోడిగుడ్లపాడు స్థానం: తల్లపురెడ్డి జయమ్మ (ఇండిపెండెంట్)ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవం పూర్తి కాగానే, మండల పరిషత్ అధ్యక్షుడి (ఎంపీపీ) ఎన్నిక ప్రక్రియను కూడా అధికారులు నిర్వహించనున్నారు . నరసాపురం ఎంపీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన కర్నాటి వెంకటరెడ్డిని కాశినాయన మండలం ఎంపీపీ (ఎంపీపీ)గా  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మెజారిటీ స్థానాలు టీడీపీ గెలుచుకోవడంతో కర్నాటి వెంకటరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు  ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం, ప్రత్యర్థులు ఎవరూ బరిలో లేకపోవడంతో ఈ 9 మంది MPTCల విజయాన్ని, అలాగే నూతన ఎంపీపీ ఎన్నికను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విజేతలకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాలను (డిక్లరేషన్ సర్టిఫికెట్లు) అందజేశారు. సర్టిఫికెట్లు అందుకున్న అనంతరం నూతన ఎంపీపీ కర్నాటి వెంకటరెడ్డి మరియు ఎంపీటీసీ సభ్యులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండల కేంద్రంలో బాణసంచా కాలుస్తూ,మిఠాయిలు పంచుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా నూతన ఎంపీపీ కర్నాటి వెంకటరెడ్డి మాట్లాడుతూ.మండల ప్రజలు, పార్టీ అధిష్టానం మరియు స్థానిక నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ లందరినీ కలుపుకొని కాశినయన మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.