కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన బంగ్లా

కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన బంగ్లా చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన భవనానికి గుర్తింపు కరువు దండేపల్లి, అక్టోబర్ 19 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చారిత్రక నేపథ్యం కలిగిన పురాతన బంగ్లా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. బ్రిటిష్, నిజాం పాలనాకాలపు చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన ఈ భవనం సరైన గుర్తింపునకు నోచుకోకపోవడంతో కాలగర్భంలో కలిసిపోతోంది. ఒకప్పుడు గత వైభవానికి సాక్ష్యంగా నిలిచిన ఈ పురాతన కట్టడం నేడు నిర్లక్ష్యానికి గురవుతుండటం చరిత్రాభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం, ఈ...