కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి
*తొర్రూరు*
అక్టోబర్ 9(ప్రజావాణి)
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వెలికట్ట గ్రామపంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం కు గ్రామ వార్డు సభ్యులు శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ వెలికట్ట శివారులోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 167 సర్వేనెంబర్ స్థలం కోర్టు తగాదాలో ఉండగా… దానికి నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభ్యుల అంగీకారం లేకుండా ఏకపక్షంగా అనుమతి ఇచ్చాడన్నారు.ఇటీవల వార్డు సభ్యుల సమావేశం జరగగా సదరు వివాద స్థలం విషయంలో సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చాడన్నారు.7 గురు వార్డు సభ్యులు ఆ ప్రతిపాదనను తిరస్కరించి సంతకాలు చేయలేదన్నారు.మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా 7 మంది సభ్యులు తీర్మానంపై సంతకాలు చేయలేదన్నారు. సమావేశానికి హాజరుకాని సభ్యుణ్ణి పంచాయతీ కార్యాలయం బయట కలిసి సంతకం చేయాలని ఒత్తిడి చేశారన్నారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి, డిపిఓ కు విన్నవించుకున్నామన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వెలికట్ట కార్యదర్శి శ్రీకాంత్ ను కాపాడుతున్నాడన్నారు.కావున కార్యదర్శి శ్రీకాంత్ పై చర్య తీసుకొని మా గ్రామానికి అనుభవం ఉన్న కార్యదర్శులు నియమించాలని కోరారు.ఈ విషయంలో అధికారులు స్పందించి అనుభవం ఉన్న మరో కార్యదర్శిని గ్రామానికి కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వడ్లకొండ ఎల్లమ్మ,యాసరపు సోమయ్య,కొమ్ము శారద, వీరమనేని రమేష్,భోగ సుజాత కమలాకర్,మరిపెద్ది సుభద్ర,అల్లంనేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.