కార్మికుల హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది – ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ డిపోలో 59 ఓట్ల మెజారిటీతో ఎన్ఎంయూ విజయం, రాష్ట్రస్థాయిలో 100 ఓట్ల మెజారిటీతో ఎంప్లాయీస్ యూనియన్ విజయం
జనగామ జిల్లా ప్రతినిధి జ్.ఉపేందర్, అక్టోబర్ 09(ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు, యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగామ ఆర్టీసీ డిపోలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన టీజీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) 59 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం గర్వకారణమని అన్నారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిందని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు తమ మద్దతును ఓట్ల రూపంలో స్పష్టంగా తెలియజేయడం సంతోషకరమని, ఇది బీఆర్ఎస్ పార్టీ పట్ల, కార్మిక పక్షపాత వైఖరి పట్ల వారికున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక కార్యక్రమాలు చేసిందని, భవిష్యత్తులో కూడా నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడే సంఘాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు నిరంతరం కృషి చేయాలని, కార్మికుల ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.